దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

GNTR: ఫిరంగిపురం మండలంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటార్ సైకిళ్లు మంజూరు చేయనున్నట్లు ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండలన్నారు. అర్హులు ఈ నెల 25వ తేదీ లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.