సొంత ఖర్చులతో వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్
MNCL: బెల్లంపల్లి పట్టణం 13వ వార్డు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కౌన్సిలర్ రాజకుమార్ అండగా నిలిచారు. తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి, తన సొంత ఖర్చులతో నూతన వాటర్ ప్యూరిఫయర్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కౌన్సిలర్ ఉదారత పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.