గ్యాస్ కొరత.. కలెక్టరేట్ ముందు నిరసన

గ్యాస్ కొరత.. కలెక్టరేట్ ముందు నిరసన

KRNL: ఉపాధిని కాపాడాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.