కొల్లాపురమ్మ దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KRNL: చిప్పగిరి మండలం నేమకలు గ్రామంలో శ్రీ కొల్లాపురమ్మ దేవి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి హాజరయ్యారు. అనంతరం శ్రీ కొల్లాపురమ్మ దేవిని దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటి సభ్యులు పాల్గొన్నారు.