రేపు గజపతినగరంలో అన్న క్యాంటీన్ ప్రారంభం
VZM: గజపతినగరంలో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక గ్రంథాలయం పక్కన నూతనంగా నిర్మించిన 'అన్న క్యాంటీన్'ను బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఈ క్యాంటీన్ నిరుపేదలకు, బాటసారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.