గోల్డెన్ అవర్‌పై డీసీపీ సూచనలు
PDPL: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని తెలిపారు. ఈ సమయంలో వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు సూచించారు.