VIDEO: 5 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కేసు నమోదు
ATP: యాడికిలోని కొనుప్పలపాడులో ఓ ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన గురువారం జరిగింది. హేమచంద్ర అనే బాలుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఓ వ్యక్తి మాస్క్ ధరించి బైక్‌పై తీసుకెళ్లాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.