'లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకోండి'

'లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకోండి'

సత్యసాయి: పుట్టపర్తితోపాటు పరిసర గ్రామాలలో అనధికార లేఅవుట్లు కలిగి ఉన్న యజమానులు క్రమబద్ధీకరణ చేసుకోవాలని మున్సిపాలిటీ సివిల్ ఇంజినీర్ రంగనాథ్ నాయక్ తెలిపారు. ప్రభుత్వం అనధికార లేఔట్ యజమానులకు ఈ నెల 4 నుంచి అక్టోబర్ 23 వరకు గడువు నిర్ణయించిందన్నారు. ప్లాట్ల యజమానులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.