VIDEO: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలోని స్థానిక ఆదర్శ నగర్‌లో ఆదర్శ దళిత యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాజోలు MLA దేవ వరప్రసాద్, మాజీ MLA కొండేటి చిట్టిబాబు సోమవారం రాత్రి ఆవిష్కరించారు. దేవ మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన చూపిన మార్గం అనుసరణీయం అని అన్నారు.