యురియా కోసం బారులు తీరిన రైతులు

WNP: రైతులు యూరియా కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ఈ ఫొటో చూస్తే అర్థమవుతుంది. యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులు అమరచింతకు యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలియడంతో ఉదయం 6 గంటలకే వివిధ గ్రామాల నుంచి రైతులు పట్టణంలోని ఓ ఫర్టిలైజర్ షాప్ ముందు ఇలా క్యూ కట్టారు. కొన్ని రోజులుగా యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.