'జీవనోపాధి సామాజిక అభివృద్ది ప్రణాలికలు సిద్ధం చేయాలి'

VZM: కొత్తవలస మండల సమాఖ్యలో రెండోరోజు 23 గ్రామ సంఘాల అధ్యక్షులకు, వీవోఏలకు గ్రామ పేదరికంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా స్వయం సహాయక బృందాలు జీవనోపాధి సామాజిక అభివృద్ది ప్రణాలికలు గ్రామాల్లో సిద్ధం చేయాలని ఏపీఎం వెంకటరమణ వీవోఏలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరావు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.