ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు
ATP: ఏసీబీ ముమ్మర దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. బుధవారం అనంతపురంలోని జెడ్పీ పరిషత్ క్యాంపస్‌లో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ, అటెండర్ నూర్ అక్రమ సంపాదన బాగోతం బట్టబయలైంది. లక్ష్మీనారాయణ రూ.10 వేలు, నూర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.