జ్యోతిబా ఫూలే జయంతి ఏర్పాట్లపై సమావేశం
PDPL: సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో ఈ నెల 11న జరగనున్న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల ఏర్పాట్లపై ఎస్.ఓ-2 జీఎం కే. చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. జీఎం కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వేడుకల కోసం యాజమాన్యం ప్రత్యేక బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. అన్ని గనులు, విభాగాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.