'పూర్వీకుల భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వండి'
సత్యసాయి: పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ సయ్యద్ అస్లాం జావిద్, సయ్యద్ బర్కతుల్లా తదితర బాధితులు శుక్రవారం పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. సర్వే నెంబర్ 334/1, 334/3లోని భూములకు వారసులమైన తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు.