నగరంలో మళ్లీ మొదలైన భారీ వర్షం

నగరంలో మళ్లీ మొదలైన భారీ వర్షం

HYD: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మెదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా.. వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.