పుట్టపర్తి పర్యటనలో SKU వీసీ జ్యోతి కుమార్‌

పుట్టపర్తి పర్యటనలో SKU వీసీ జ్యోతి కుమార్‌

సత్యసాయి: పుట్టపర్తి పర్యటనకు విచ్చేసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU) నూతన ఉపకులపతి (VC) జ్యోతి కుమార్‌కు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం నుంచి వచ్చిన వీసీని పుష్పగుచ్ఛంతో ఆహ్వానించి, శాలువాతో సత్కరించి బాబా ఫోటోను బహుకరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధిపై చర్చించారు.