VIDEO: అస్వస్థతకు గురైన విద్యార్థులు

VIDEO: అస్వస్థతకు గురైన  విద్యార్థులు

ప్రకాశం: కనిగిరి మండలంలోని బడుగులేరు గ్రామంలో 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగడం వల్ల ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలియాజేశారు. వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి, చికిత్సను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉగ్ర ఆసుపత్రిలో విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.