'వృద్ధుల భద్రత, గౌరవం కోసం శాఖల సమన్వయం అవసరం'
కృష్ణా: గురువారం కలెక్టరేట్‌లో జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, వృద్ధుల సంరక్షణ మన మానవత్వానికి నిదర్శనం అని, వారిపై చూపించే ప్రేమ తిరిగి మనకు వస్తుందని తెలిపారు. అనంతరం వృద్ధుల భద్రత, గౌరవం, శ్రేయస్సు కోసం రెవెన్యూ, పోలీసు, సంక్షేమ శాఖల మధ్య సమన్వయం అవసరం ఉందని అన్నారు.