'పదో తరగతిలో వంద శాతం ఫలితాలే లక్ష్యం'
SRPT: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ విద్యాశాఖను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఫలితాల్లో నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.