VIDEO: అంధకారంలో కోదాడ బస్టాండ్ ఏరియా
SRPT: కోదాడ బస్టాండ్ ఆవరణలో ముఖ్యంగా అనంతగిరి రోడ్డుకు వెళ్లే మార్గంలో విద్యుత్ దీపాలు వెలగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని స్తంభాలకు మాత్రమే లైట్లు వెలుగుతుండగా, మరికొన్ని చోట్ల చీకటి నిండి ఉండటంతో రాత్రి వేళల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టి అన్ని లైట్లు వెలిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.