చిత్తూరులో జాతీయ లోక్ అదాలత్.. రేపే!

CTR: జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. ఈ మేరకు లోక్ అదాలత్ నిర్వహణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. కక్షిదారులకు సత్వర న్యాయం లోక్ అదాలతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం కక్షిదారులు అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.