పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

PLD: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణం తాలూకా సెంటర్‌లో ఆయనకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక గుర్తింపు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అపూర్వమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.