అధ్వానంగా తయారైన వేములపాడు రోడ్డు

అధ్వానంగా తయారైన వేములపాడు రోడ్డు

ప్రకాశం: కనిగిరి నుంచి వేములపాడు మీదుగా కంభంకు వెళ్లే ఆర్ అండ్ బి రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. రోడ్డు తారు లేచిపోయి గుంటలు పడి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఈ రోడ్డులో ప్రయాణించేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.