VIDEO: HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
MLG: జిల్లా కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ 14-15 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏటూరునాగారం, వెంకటాపురం CHC కేంద్రాల్లో ఈ టీకా అందుబాటులో ఉంటుందని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ చాలా ముఖ్యమైనదని కలెక్టర్ పేర్కొన్నారు.