ఇసుక తరలింపుపై లారీ అసోసియేషన్ నిరసన

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో లారీ అసోసియేషన్ సభ్యులు నిరసనకు పిలుపునిచ్చారు. శుక్రవారం నుంచి ఇసుక సరఫరా నిలిపివేయాలని లారీ యజమానులకు తెలిపారు. నెల్లూరు నుంచి మార్కాపురం లారీలలో ఇసుక తరలిస్తున్నా గిట్టుబాటు ధర లభించడం లేదని, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కలిసి ప్రజల వద్ద నుంచి నగదు దోచుకుంటున్నారని యూనియన్ సభ్యులు ఆరోపించారు.