కొత్తగూడెం మేయర్ పీఠం CPI కైవసం.. వనపర్తిలో సంబరాలు
WNP: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని CPI పోరాడి, 22 డివిజన్లతో పాటు సాధించుకుంది. ఈ విజయంతో వనపర్తిలో CPI శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ప్రలోభాలకు లొంగకుండా ఎర్రజెండాను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.