VIDEO: ఈతకు వెళ్లి యువకుడు మృతి
CTR: ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన సోమల మండలంలో ఆదివారం జరిగింది. పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన ముని రెడ్డి (40) రెడ్డివారిపల్లి సమీపంలోని రెడ్డివారి చెరువులో మధ్యాహ్నం ఈతకు వెళ్ళాడు. చెరువు మధ్యలో ఉన్న మొక్కలలో మునిగిపోయి చనిపోయాడు. అతను ఎంతసేపటికి రాకపోవడంతో స్థానికులు సాయంత్రం గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు.