జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

SRPT: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు శనివారం కనుల పండుగగా జరిగాయి. నవరాత్రులు మండపాల్లో పూజలు అందుకున్న గణపయ్య శోభయాత్ర శనివారం అర్ధరాత్రి వరకు అట్టహాసంగా సాగాయి. ఆనందోత్సవాలతో గణపతి పప్పా మోరియా అంటూ గణపయ్యకి వీడ్కోలు పలికారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేది.