'చలో అసెంబ్లీ'కి బయలుదేరిన మున్సిపల్ కార్మికులు
నల్గొండ మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి మంగళవారం బయలుదేరి వెళ్లారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్యలు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ. 26,000 లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అవుట రవీందర్, సంతోష్, సంజీవ, శ్రవణ్ పాల్గొన్నారు.