PMAY లబ్ధిదారులకు అర్హత పత్రాలు పంపిణీ
SKLM: పలాస మున్సిపాలిటి ఉదయపురంలో PMAY పథకం కింద రూ.3 లక్షల నూతన గృహ ప్రవేశ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శిరీష హాజరయ్యారు. నూతన గృహాలను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం PMAY అర్బన్ 2.0 పథకం కింద 66 మంది లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ రామారావు ఉన్నారు.