VIDEO: జిల్లా పరిషత్ పాఠశాలలో న్యాయ సేవ సదస్సు
KMR: బిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యా వనరుల అధికారి రాజగంగారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా సమానత్వం పాటించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.