'ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి'
KMM: నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. గురువారం బీఆర్ఎస్ నాయకులు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని వడ్లు, మొక్కజొన్న పంటలకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యమవుతున్న కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.