నందిగామలో పురపాలక సంఘం అత్యవసర సమావేశం

NTR: నందిగామ పాత బస్టాండ్‌లోని బాబు జగజీవన్ రావు హాల్‌లో మున్సిపల్ అత్యవసర సమావేశం జరిగింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని పలు అంశాలను ఆమోదించారు. వేసవి దృష్ట్యా తాగునీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. అభివృద్ధి పనులను క్రమబద్ధంగా అమలు చేయాలని సూచించారు.