VIDEO: ఉద్రిక్తత.. కార్మికుల సంఘాలు నిరసన

VIDEO: ఉద్రిక్తత.. కార్మికుల సంఘాలు నిరసన

BDK: బూర్గంపాడు మండలం, సారపాకలోని ఐటీసీ కర్మాగారం వద్ద సోమవారం కార్మికులు భారీగా ఆందోళన చేపట్టారు. 14వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అడ్మిన్ బ్లాక్ ఎదుట బైఠాయించారు. యాజమాన్యం ఆలస్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.