VIDEO: విజయవాడ మహిళ పాటకు పీఎం ఫిదా..!
NTR: విజయవాడ సత్యనారాయణపురం నివాసి లలిత పాడిన శ్రీ దుర్గా దేవి తెలుగు పాటను ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుర్గా దేవి ఆరాధనతో అపార శక్తి లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని ట్వీటుకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. విజయవాడ వాసి పాడిన పాటను ప్రజలతో పంచుకోవడం నగరవాసులందరికీ గర్వకారణమని MLA పేర్కొన్నారు.