భద్రకాళి ఆలయంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన రచ్చ రవి

భద్రకాళి ఆలయంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన రచ్చ రవి

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సోమవారం జబర్దస్త్ ఫేమ్ హాస్యనటుడు రచ్చ రవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రచ్చ రవి తన స్వీయ అనుభవాలతో రచించిన 'నీ రుణం తీరేది ఎట్ల?' పుస్తకాన్ని అమ్మవారి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తదితరులు ఉన్నారు.