కలెక్టరేట్‌లో సీపీ బ్రౌన్ జయంతి వేడుకలు
PPM: కలెక్టరేట్‌లో సీపీ బ్రౌన్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషకు శాస్త్రీయ పునాది వేసిన సీపీ బ్రౌన్ మనందరికీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.