గంజాయి విక్రయదారుడి అరెస్టు
WGL: ఖిలావరంగల్‌లో గంజాయి విక్రయిస్తున్న ఆటో డ్రైవర్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. శివనగర్‌కు చెందిన సింగిరెడ్డి ప్రశాంత్ వద్ద నుంచి 1.396 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం సీలేరు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్టు మిల్స్ కాలనీ సీఐ రమేశ్ తెలిపారు.