ప్రధాని మోదీ నాయకత్వం వల్లే ఈ విజయం: పవన్ కళ్యాణ్

GNTR: హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రధాని మోదీ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై దృష్టి, ఆయనకున్న ప్రజల మద్దతును మరోసారి చాటి చెప్పిందన్నారు. హరియాణా, జమ్మూ&కశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.