ఆశా కార్యకర్త ఆత్మహత్య

KMR: సదాశివనగర్ మండలం పద్మాజివాడికి చెందిన ఆశా కార్యకర్త మ్యాదరి అంబిక (37) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు ఒక కూతురు ఉండగా ఇటీవలే ఆమె పెళ్లి చేసినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె బవలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.