డయేరియా వల్ల మరణాలు సంభవించలేదు: మంత్రి

AP: విజయవాడలోని న్యూరాజరాజేశ్వరిపేటలో డయేరియా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కొనేందుకు దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికి నీటి పరీక్షల నివేదికలు వస్తాయన్నారు. రిపోర్టులు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డయోరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని సూచించారు.