ALERT: రెండు రోజులు భారీ వర్షాలు

ALERT: రెండు రోజులు భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈనెల 17, 18న దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.