హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఎస్పీ

సూర్యాపేట: ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే పేర్కొన్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.