యుద్ధం వేళ బ్రిటన్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ బ్రిటన్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌పై దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొనబోమని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఇరాన్‌లో ప్రభుత్వం మారాలని తాను కోరుకోవడం లేదని తెలిపారు. మరో వైపు అమెరికా రక్షణ కోసం తమ దేశ సైనిక స్థావరాలను అగ్రరాజ్యం ఉపయోగించుకోవచ్చని స్టార్మర్ చెప్పారు.