'ఉపాధి కొరకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి'
ASR: అరకులోయ మండలం లోతేరు గ్రామంలో ఎంపీడీవో లవరాజు, ఎస్సై గోపాలరావు ఆధ్వర్యంలో గంజాయిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గంజాయి సాగు, విక్రయం, రవాణా నేరమని పేర్కొన్నారు. ఉపాధి కొరకు ప్రభుత్వాలు అనేక పథకాలు ఇస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయితో దొరికితే కఠిన శిక్షలు ఉంటాయని, బెయిల్ రావడం కూడా కష్టమౌతుందన్నారు.