మార్చి 19న గేట్ ఫలితాలు విడుదల

మార్చి 19న గేట్ ఫలితాలు విడుదల

గేట్ 2026 ఫలితాలను ఈనెల 19న విడుదల చేయనున్నట్లు ఐఐటీ గౌహతి వెల్లడించింది. https://goaps.iitg.ac.in/login వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరిలో జరిగిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడి, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి ఫలితాలు, స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల అనంతరం అధికారిక స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.