చిలుకూరు మండల ఆర్టీఐ నూతన మండల కమిటీ ఎన్నిక
SRPT: చిలుకూరు మండల కేంద్రంలో ఈరోజు సమాచార హక్కు చట్టం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోదాడ నియోజకవర్గ ఇంఛార్జ్ గడ్డం అంజి, నాయకులు వీరబాబు, బత్తుల శీను ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కందుకూరు వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా వీరబాబును ఎన్నుకున్నట్లు వారు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు.