'సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలి'
శ్రీకాకుళంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. దేవాలయాల పురాతన నిర్మాణాలను, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని తెలిపారు.