'ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంట'
ASR: చింతపల్లి మండలం కొత్తపాలెం-1 సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పవన్, వీఏఏ రవీంద్ర, వీఎస్ఏ ప్రవీణ్ పడాల్ బుధవారం మామిడిపల్లిలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమయ్యారు. రైతులకు పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని వారికి సూచించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి సాంద్రత పెరిగి, ఆరోగ్యకరమైన పంటతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.