మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను పోలీసులు నిర్వహించారు. మైనర్‌ల చేత వాహనాలు నడపకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారుల ప్రాణ భద్రత కోసం తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.